మునుపటి ప్రశ్నలకు జవాబులు :-
మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు? దేని ఉద్దేశ్యముతో మనవున్ని దేవుడు తయారు చేశాడు? [why god created man? what made him to create a man kind?]
padmavidya1990@gmail.comఒకటి ఉంది అని తెలియాలి అంటే రెండోది ఉన్నప్పుడేగా తెలిసేది! దృష్టి ఉంటే గదా దృశ్యము తెలిసేది! దేవుడు ఉన్నాడు, యే విధముగా ఉన్నాడు అనేది తెలియడానికే.. దేవుడు మనిషిని సృష్టించాడు. అందుకే విశ్వవ్యాపి అయిన దేవుడు తన జ్ఞానం తెలియజేయుటకు ఒక మనిషిలాగే భగవంతునిగా పుట్టి దైవజ్ఞానం తెలియజేస్తాడు.త్రేతాయుగములో దేవుడు రావణ బ్రహ్మగా అవతరించి బ్రహ్మ విద్య శాస్త్రమును, ఆచరణను తెలియజేశాడు. ఆతర్వాత ద్వాపరయుగములో శ్రీ కృష్ణునిగా వచ్చి జ్ఞానము తెలియజేశాడు, ఆయన చెప్పినదే భగవద్గీత.
RBDBS web team
రావణ బ్రహ్మను రావణాసురుడు అని అనడములో అసురులు అంటే మత్తు మందు త్రాగని వారు అని అంటారు కదా! మరి భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగము లో అసురులు అంటే నాస్తికులు, హేతువాదులు గా వుంది కదా! రావణ బ్రహ్మ విషయంలో ఒక భావం, భగవద్గీత దైవాసుర సంపద్విభాగ యోగం లో అదే 'అసుర' పదానికి మరొక భావం కనిపిస్తున్నది కదా! ఇలా ఒకే 'అసుర' పదానికి రెండు భావాలు ఎలా వున్నాయి? నాకు అర్థము కాలేదు. దయచేసి చెప్పగలరు.
vikram.srinivas5@gmail.comఅసురుడు అన్న పదానికి అసలైన అర్ధం సురాపానం చేయనివాడు అని . రావణ బ్రహ్మ అసురుడు అంటే రావణ బ్రహ్మ మత్తు మందు త్రాగని వాడు అని అర్థం. ఇది త్రేతాయుగం నాటి వాస్తవమైన అర్థం. తర్వాత కాలం లో ఈ పదం యొక్క అర్థం మారిపోయి అసురుడు ఆంటే రాక్షసుడు అనే అర్థముగా స్థిరపడినది. ద్వాపర యుగము నాటికే ఈ పదము యొక్క అసలైన భావం మారినది. అందుకే భగవద్గీత లో ఈ అసురులు అన్న పదాన్ని రాక్షస గుణాలు వున్న వారిని - నాస్తికులను, ఒక్కడే అయిన దేవుడిని పూజించనివారిని సంబోధించడానికి వాడబడింది. ఎందుకంటె మారిపోయిన ఆ అర్ధంతో చెప్పితేనే ఆ పద అర్థం అప్పటి జనాలకు బోధపడుతుంది, ఇప్పటికీ ఇదే అర్థంతో వాడుతున్నాము.
RBDBS web team
వేదాలు జ్ఞానానికి మార్గాలు చూపవా? ఐతే ఎందుకు పెద్దలు వేదాలు రచించారు?
komalkrishnabhargav@gmail.comవేదాలు ప్రపంచ జ్ఞానం తెలుపుతాయి. అలనాటి పెద్దలకు బ్రహ్మ విద్య శాస్త్ర జ్ఞానం తెలియదు, కాబట్టి వాళ్ళు వేదాలను గొప్పగా అనుకొన్నారు. అలా అనుకొనే వ్యాసుడు వేదాలు క్రోడీకరించి రచించడం జరిగింది. కానీ అర్జునుని ద్వారా భగవద్గీత సారాంశం తెలుసుకున్నాక, తప్పు తెలుసుకొని వ్యాసులవారు భగవద్గీత రచించడం జరిగింది. వేదాలు గుణ విషయాలే తెలియ చేస్తాయని, అవి మాయ మార్గమని తెలియ చేయడం జరిగింది. తెలుసుకోవడానికి, "ద్రావిడ బ్రాహ్మణ" అనే గ్రంధం మన వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసుకొని చదవండి.
RBDBS web team